గజం 2.50 లక్షలు..కోకాపేటలో కాదు పాలకొల్లులో - MicTv.in - Telugu News
mictv telugu

గజం 2.50 లక్షలు..కోకాపేటలో కాదు పాలకొల్లులో

February 27, 2020

fbc

భూమి రేట్లు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. పట్టణాల్లో ఎక్కువగా.. గ్రామాల్లో తక్కువగా ఉంటాయి. అదే హైదరాబాద్‌లోని కోకాపేటలొ అయితే గజం లక్షల్లో ఉంటుంది. హైటెక్ సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ.. ఎలాంటి హంగులూ, ప్రాధాన్యం లేని ప్రాంతంలో భూమి ధర కోకాపేట భూముల ధరను మించిపోయింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో మాత్రం ఎన్నడూ లేని విధంగా గజం ధర రూ.2.50 లక్షలు పలికి రికార్డు సృష్టించింది. 

పాలకొల్లు పట్టణ ప్రధాన రహదారి క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయానికి సమీపంలోని భూమికి ఈ ధర పలికింది. పట్టణంలో గజం రూ.32-40 వేల మధ్యలో ఉంది. కానీ, ఓ వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా గజానికి రూ.2.50 లక్షలు పెట్టి 200 గజాలకుపైగా కొనుగోలు చేశారు. ఒక భాగంలో గజానికి రూ.1.75 లక్షలు చెల్లించగా.. మరో భాగంలో గజానికి రూ.2.50 లక్షలు పెట్టారు. మహాత్మాగాంధీ రోడ్డుగా పిలిచే ఈ రహదారి వెంబడే ఉన్న స్థలాలు పెద్ద నోట్ల రద్దుకు ముందు గరిష్టంగా గజం ధర రూ.1.25 లక్షలు పలికింది. అయితే, ఈ భూమికి అంత ధర ఎందుకు పలికిందనేది అంతుచిక్కడం లేదు.