బ్యాటరీ తయారీ సంస్థ అమరరాజాకి పాలమూరులో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కాలుష్య కారక పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తేల్చి చెప్పేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందూలాల్, పీసీబీ ఈఈ సంగీతలను బాధిత గ్రామాలైన దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్ధాయిపల్లి ప్రజలు అడ్డుకున్నారు. ఇప్పటికే బ్యాటరీ పరిశ్రమ ఉన్న చిత్తూరు జిల్లాలో ఆయా గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తమకు తెలిశాయని, అక్కడి హైకోర్టు కూడా ఆ పరిశ్రమ వద్దని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై స్థానికుడు హన్మంతు మాట్లాడుతూ ‘గతంలో డైయింగ్ ప్లాంట్ వల్ల సమస్యలు వచ్చాయి. సీఎం వైఎస్సార్ కి చెప్తే ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయమని చెప్పారు.
కానీ ఖరీదు ఎక్కువ కావడంతో కంపెనీ వాళ్లే మూసేసి వెళ్లిపోయారు. ఆ నీరు తాగి పశువులు, చేపలు చనిపోగా చిన్నపిల్లలు, గర్భిణీలు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బ్యాటరీ యూనిట్ పెడితే అలాంటి సమస్యలే వస్తాయి. ఐటీ ఆధారిత పరిశ్రమలు ఓకే కానీ, కాలుష్య పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మేమంతా ఊరు విడిచి వెళ్లాల్సిందే’నని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రకటించారు. అటు ప్రజలు చెప్పిన అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ వెంకట్రావు ప్రకటించారు. కాగా, ఈ నెల 2న రూ.9 వేల 500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ నెలకొల్పేందుకు అమరరాజా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల ప్రత్యక్షంగా పదివేలు, పరోక్షంగా 20వేల మందికి ఉపాధి లభిస్తుందని