జయ మరణంపై న్యాయ విచారణ - MicTv.in - Telugu News
mictv telugu

జయ మరణంపై న్యాయ విచారణ

August 17, 2017

తమిళుల ‘అమ్మ’ జయలలిత అనుమానాస్పద మరణంపై ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి న్యాయ విచారణకు ఆదేశించారు. దీని కోసం ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రిటైరైన జడ్జి లేదా, హైకోర్టు జడ్జి విచారణ చేపడతారని వెల్లడించారు. జయలలిత నివాసాన్ని స్మారక స్థలంగా మార్చి, ప్రజలను అనుమతిస్తామని తెలిపారు.సీఎం నిర్ణయంతో అన్నాడీఎంకే వర్గాలు మరింత త్వరలోనే విలీనమయ్యే అవకాశముంది. జయ మరణంపై విచారణ కోసం మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తోంది.

జయ చివరి రోజుల్లో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె పరిస్థితిపై బోలెడు అనుమానాలు వచ్చాయి. అత్యంత సన్నిహితురాలు శశికళ తానే అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. జయ బంధువులను ఆస్పత్రికి రానివ్వలేదు. దీంతో జయ ఎలా చనిపోయిందనే అనుమానాలకు సహజంగానే శశి టార్గెట్ అయ్యారు. జయమ్మతో కలసి అవినీతికి పాల్పడిన కేసులో ఇప్పటికే జైల్లో ఊచలు లెక్కిస్తున్న శశికళ భవితవ్యం పళని విచారణ నిర్ణయంతో మరింత సందిగ్ధంలో పడిపోయింది.