తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలపుల్లో మరో మలుపు పళని స్వామి. చిన్నమ్మ చాటు సిఎం అని అంతా అనుకున్నారు. కానీ అట్లా కాదు. చిన్నమ్మకే కాదు… విపక్ష నేత స్టాలిన్ కూడా ఎర్త్ పెట్టాడు. మామూలు ప్లాన్ కాదు… ఎంతటి సీనియర్ నాయకులైనా సరే అదిరి పడే ప్లాన్ వేశాడు. అంతేకాదు ప్లాన్ విషయం పూర్తిగా అర్థం అయితే కండ్లు బైర్లు కమ్మి పడిపోవాల్సిందే. అంతటి ప్లాన్ వేశాడు.
ఇన్ని రోజులు అంతా డమ్మి సిఎం అనుకుంటే తొల్త చిన్నమ్మ శశికళకు తానేంటో చూపించాడు. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్లాన్ చేసిన దినకరన్ కు రుచి చూపించాడు. దీన్ని అదునుగా భావించిన స్టాలిన్ కు అస్సలు సిన్మా చూపించాడు. దినకరన్ మాటలను బట్టి 19 మంది ఎంఎల్యేలు మద్దతు ఉపహరించుకుంటారు కాబట్టి ప్రభుత్వం పడిపోతుందని గవర్నర్ ను కల్సిన స్టాలిన్ కు చుక్కలు చూపిస్తున్నాడు పళనిస్వామి. అస్సలు లాటరీ టికెట్ల వ్యాపారం చేసిన పళనితో పెట్టుకుంటే మాటలా…. తన కంటే ముందుగా సిఎంగా చేసిన పన్నీర్ కే డిప్యూటీతో సరిపెట్టారు. అలాంటిది ఆయనతో పెట్టుకుంటే ఊరుకుంటారా ఏంటి.
ఇంతకు ఆయన స్టాలిన్ కు ఇచ్చిన షాక్ ఏంటంటే… గతంలో గుట్కా వ్యాపారంపై డిఎంకే సభ్యులు సభలో అధికార పక్షాన్ని నిలదీశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకున్నారు. అయితే గుట్కా వ్యాపారం చేస్తున్న వారిలో 20 మంది వరకు డిఎంకే ఎంఎల్యేలున్నారు. వారందర్నీ సభలో సస్పెండ్ చేయాలని పళని స్వామి స్పీకర్ ను కోరారు అంతే కాదు ముందు ముందు వారిపై ఇంకాస్త కఠిన చర్యలూ ఉండొచ్చు. ఇప్పటి వరకైతే ఎక్కువ రెచ్చిపోతే మీ సభ్యులే కాదు సంఖ్యాబలమూ ఉండదని సిగ్నల్ ఇచ్చాడు స్టాలిన్ కు.
దీంతో స్టాలిన్ కు దిమ్మ తొరిగి బొమ్మ కన్పించినట్లుంది. దాంతో పాటు దినకరన్ మరింత రెచ్చిపోవడంతో.. ఆయనకు బ్రేకులు వేయడానికి శశికళ ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరికలూ పంపాడు. ఇక ముకు తాడు వేయడానికి ఇంత కంటే ఏం కావాలి. అందుకే రాజకీయాలు అందరూ పన్నీరు సెల్వంలు ఉండరు. అప్పుడు డప్పుడు పళని స్వాములు కూడా వస్తుంటారు. ఎత్తులు వేయడం కొందరికే కాదు… అందరకీ వస్తాయని అయితే సమయం చూసి ప్రయోగిస్తారని పళని నిరూపించాడు.
స్టాలిన్ ఏమాత్రం ఎగిరినా తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాదు… మరింత ఇబ్బందుల్లో పడ్తాడు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పళని మంచి ప్లాన్ వేశాడు. కాదు కూడదూ అని అంటే… డిఎంకే ఎంఎల్యేల గుట్కా వ్యాపారానికి సంబంధించిన విజువల్స్ కూడా బయట పెడ్తానని అంటున్నారట పళని స్వామి. ఇట్లా ఒక దెబ్బకు అటు దినకరన్ ను, ఇటు స్టాలిన్ కు బ్రేక్ వేశాడు పళని స్వామి.