Palvai Sravanthi complains to EC about fake news
mictv telugu

ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి

November 3, 2022

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై ఈసీ కి ఫిర్యాదు చేశారు. తాను సీఎం కేసీఆర్‌ను కలిసానని కొందరు నకిలీ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తోన్నారని కంప్లైంట్ చఏశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఇలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని అందులో పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాల్వాయి స్రవంతి ఎన్నికల అధికారులను కోరారు.

ఇటీవల మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారంటూ ఓ వార్త హల్‌చల్ చేసింది. చండూరులో టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్‌తో పాల్వాయి స్రవంతి భేటీ అయ్యారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై కాంగ్రెస్ వర్గాలు మండిపడ్డాయి. పోలింగ్ వేళ ఓటర్లను ప్రభావితం చేసేలా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని, ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.