Palvai Sravanti will be the Congress candidate in the munugodu by-election
mictv telugu

కాంగ్రెస్‌లో వీడిన ఉత్కంఠ.. మునుగోడు అభ్యర్ది ఖరారు

August 25, 2022

Palvai Sravanti will be the Congress candidate in the munugodu by-election

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైన మునుగోడులో బీజేపీ పార్టీ ప్రచారంలో ఇప్పటికే దూసుకెళ్తోంది. అటు అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్ధిని ఎంపిక చేసే పనిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరపున అభ్యర్ధి ఎంపిక విషయంలో ఇప్పటివరకు చాలా కసరత్తు జరిగింది.

చివరికి ఇద్దరిని ఫైనల్ చేయగా, అందులో ఒకరని ఎంపిక చేయడం పార్టీకి కష్టంగా మారింది. చివరకి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్, టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు ఒకరిని ఖాయం చేశారు. దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిని ఖరారు చేశారు. ఈ అంశంలో నివేదికను టీపీసీసీ అధిష్టానానికి పంపింది. దీంతో ఇక నుంచి ప్రచారంపై దృష్టి సారించవచ్చని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కాగా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడులో కాంగ్రెస్ తరపున ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇందులో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం.