పాన్ -ఆధార్ లింక్ మస్ట్..ఎప్పటి నుంచి అంటే... - MicTv.in - Telugu News
mictv telugu

పాన్ -ఆధార్ లింక్ మస్ట్..ఎప్పటి నుంచి అంటే…

June 28, 2017

పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేశారా..? లేదంటే వెంటనే అనుసంధానం చేయండి..ఎందుకంటే జులై ఒకటి నుంచి పాన్ -ఆధార్ లింకు తప్పనిసరని కేంద్రం తేల్చిచెప్పింది. వీళ్లు మాత్రం మస్ట్ గా చేయాల్సిందే..వాళ్లెవరంటే…

సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందాలంటే ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం జారీ చేసిన ప్రకటనపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. దీంతో ప్రభుత్వం ఆధార్‌-పాన్‌ అనుసంధాన్ని తప్పనిసరి చేస్తూ మరుసటి రోజే నిర్ణయం తీసుకుంది. జులై 1, 2017 నుంచి పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆధార్‌ నంబర్‌ను సెక్షన్‌ 139ఏఏలోని సబ్‌సెక్షన్‌(2) ప్రకారం తప్పనిసరిగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంకమ్‌ ట్యాక్స్‌-డీజీఐటీ(సిస్టమ్స్‌)కు తెలియజేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒకటో తారీఖు నుంచి ఐటీ రిటర్న్స్‌ ఫైలింగ్‌కు ఆధార్‌-పాన్‌ అనుసంధానం తప్పనిసరి అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ స్పష్టం చేసింది. దేశంలో మొత్తం 25 కోట్ల మంది పాన్‌ కార్డుదారులు ఉండగా.. 111 కోట్ల మందికి ఆధార్‌ కార్డులు ఉన్నాయి.