కోహినూర్ కిళ్లీ.. వయాగ్రా కంటే పవర్‌ఫుల్! - MicTv.in - Telugu News
mictv telugu

కోహినూర్ కిళ్లీ.. వయాగ్రా కంటే పవర్‌ఫుల్!

December 4, 2017

పురుషుల్లో పుణ్యపురుషులు వేరన్నట్లు.. కిళ్లీల్లో పవర్‌ఫుల్ కిళ్లీలు వేరు. రకరకాల ఫ్లేవర్స్‌తో వస్తున్న కిళ్లీల గురించి మనకు తెలిసిందే. అయితే మహారాష్ర్ట ఔరంగాబాద్‌లో 50 ఏళ్ల నుంచి నడుస్తున్న తారా పాన్ షాప్ కిళ్లీల గురించి విని ఉండరు. ఇందులో 51 రకాల కిళ్లీలు అమ్ముతున్నారు.ఇందులో ఒక పాన్ మాత్రం చాలా విశిష్టమైంది. దీని ధర ఏకంగా రూ. 500. దీని పేరు కోహినూర్. ఇంత ఖరీదైనా దీని కోసం క్యూలు కడుతున్నారు. ముఖ్యంగా నవదంపతుల నుంచి తొలిరాత్రి కోసం దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. మహారాష్ట్ర నుంచే కాదు దేశం నలుమూలల నుంచి దీని కోసం ఆర్డర్లు వస్తున్నాయి. ఇంత డిమాండ్ ఎందుకంటే.. ఇది వయాగ్రా కంటే శక్తిమంతమైనది కాబట్టి. ఇండియా వయాగ్రాగా పేరొందిన ఈ పాన్లో వేసేవన్నీ ఖరీదైనవే. కిలో రూ. 70 లక్షలు పలికే కస్తూరి, కిలో రూ. లక్ష పలికే కుంకుమపువ్వు, కిలో రూ. 80 వేలు పలికే రోజ్ వంటి మరెన్నో సుగంధ ద్రవ్యాలను ఇందులోనింపుతారు. ఇవేకాకుండా బయటికి చెప్పని పదార్థాలు కూడా ఉంటాయి.దీంతో ఇవి శరీరంలో ఉత్తేజాన్ని నింపుతాయి. రక్తప్రసరణను పెంచుతాయి. తన తల్లి ఈ ఫార్మూలా చప్పిందని షాపు యజమాని సిద్ధిఖి తెలిపాడు. కోహినూర్ పాన్ ఖరీదు అని భయపడక్కర్లేదని, అదే ఫార్మూలాతో కొన్ని మార్పులు చేసిన కిళ్లీని రూ. 3వేలకు అందిస్తున్నానని చెప్పాడు. ఈ ప్రత్యేక కిళ్లీలను ప్రత్యేక డిజైన్లతో కూడిన బాక్సులో అందివ్వడం మరో విశేషం. రోజూ 10వేల పాన్లు అమ్ముతున్న ఈయన ఆదాయపన్ను కడుతున్నాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.