పంచలు ఊడదీసి కొడతా.. కొడాలి నానికి దివ్యవాని వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

పంచలు ఊడదీసి కొడతా.. కొడాలి నానికి దివ్యవాని వార్నింగ్

May 20, 2022

మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యవాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘కొడాలి నాని నోరు విప్పితే బూతులు తప్ప మరేమీ రావు. రాజకీయాల కోసం, పదవుల కోసం ఇక నుంచి బూతులు మాట్లాడితే, పంచలు ఊడదీసి కొడతాం. ఒకప్పుడు గుడివాడ అంటే దివంగత ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేవారు. అలాంటి గుడివాడను ఇప్పుడు క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు. క్యాసినో నాని ముందు గుడివాడలో రోడ్లు వేసి చూపించాలి. గుడివాడ గడ్డను టీడీపీ అడ్డాగా మారుస్తాం” అని ఆమె సవాల్ విసిరారు.

తాజాగా జగన్ మోహన్ రెడ్డి పాత మంత్రులందరితో మూకుమ్మడి రాజీనామాలు చేయించి, కొత్త మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి దక్కుతుందని ఆశగా ఎదురుచూసిన ఆయన అనుచరులకు నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొడాలి నానిని ఎందుకు మంత్రి పదవి నుంచి తప్పించారు? ఏ కోపంతో దూరం పెట్టారు? మంత్రిగా కొడాలి ఫెయిల్ అయ్యారా? లేదంటే ఆయన నోటి దురుసే వల్ల మంత్రి పదవి నుంచి తప్పించారా? అని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో టీడీపీ నాయకురాలు కొడాలి నాని పంచలు ఊడదీసి కొడతా అని వార్నింగ్ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.