కంగన పిచ్చిది.. - MicTv.in - Telugu News
mictv telugu

 కంగన పిచ్చిది..

September 5, 2017

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. తనపై కంగన చేసిన ఆరోపణలపై నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలీ గయ్యిమన్నాడు. ‘కంగన పిచ్చిది. ఆమెపై లీగల్ చర్య తీసుకుంటాను’ అని హెచ్చరించాడు. ‘ఆమె ఇంటర్వ్యూ చూసినప్పుడు ఓ పిచ్చిపిల్ల మాట్లాడుతున్నట్లు అనిపించలేదా మీకు? మేం చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో ఉంటున్నాం. ఇప్పటివరకు మాపై ఇంతటి నీచమైన ఆరోపణలు ఎవరూ చేయలేదు. పెంటపై రాయివేస్తే అది మనమీదికే వచ్చి పడుతుంది. కంగనపై కోర్టుకెళ్లి చర్యలు తీసుకుంటాను. ఆమె మిగతావారి(మాజీ ప్రియుడు హృతిక్ రోషన్) విషయంలో ఏం మాట్లాడిందో నాకు అక్కర్లేదు. అయితే నేను ఆమెను కొట్టానన్న వార్త మాత్రం పచ్చి అబద్ధం. దుమ్ముంటే ఆమె తన ఆరోపణలను  నిరూపించమనండి. నా కుటుంబం ఘోర అవమానం ఎదుర్కొంది’ అని ఫైర్ అయ్యాడు పంచోలీ.

తన కెరీర్ తొలినాళ్లలో పంచోలీ తనను హింసించేవాడని, పలుసార్లు రక్తమొచ్చేలా కొట్టాడని కంగన ఇటీవల చెప్పడం తెలిసిందే. అంతేకాకుండా హృతిక్ రోషన్ పైనా తీవ్ర ఆరోపణలు చేసింది. గత ఏడాదిలో హృతిక్ తనను ప్రేమించాడని, ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పడం ఇష్టం లేక తర్వాత ముఖం చాటేశాడని చెప్పింది.