ఢిల్లీ-గోవా ఫ్లైట్‌లో ఉగ్రవాది.. టెన్షన్.. టెన్షన్.. చివరికి ఇలా ! - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ-గోవా ఫ్లైట్‌లో ఉగ్రవాది.. టెన్షన్.. టెన్షన్.. చివరికి ఇలా !

October 23, 2020

ngngfn

ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఎయిరింయా విమానంలో ఓ వ్యక్తి ఉగ్రవాది ఉన్నాడంటూ హల్ చల్ చేశాడు. దీంతో మిగతా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. జియా ఉల్‌ హక్‌(30) అనే వ్యక్తి తాను స్పెషల్‌ సెల్‌ అధికారిని అని.. విమానంలో ఉన్నాడని‌ హల్‌చల్‌ చెప్పాడు. దీంతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

తీరా ఆ వ్యక్తి చెప్పింది అబద్ధం అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతన్ని దుపులోకి తీసుకుని విమానం గోవాలోని డబోలిమ్‌ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులకు అప్పగించారు. వారు జియా ఉల్‌ హక్‌ను విచారించి అతడికి మతి స్థిమితం సరిగ్గా లేదని తేల్చారు. అతడు ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కనుగొన్నారు. స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత అతడిని పనాజీలోని మానసిక వ్యాధుల చికిత్స కేంద్రంలో చేర్పించారు.