పానీపూరీ కావాలా నాయనా.. ఇదిగో మిషన్లు వచ్చేశాయ్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పానీపూరీ కావాలా నాయనా.. ఇదిగో మిషన్లు వచ్చేశాయ్ (వీడియో)

July 4, 2020

Panipuri Vending Machine

పానీపూరీ అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బయటకు వెళ్లారంటే చాలు దాన్ని నోట్లో వేసుకోకుండా ఉండలేరు. ముఖ్యంగా అమ్మాయిలు, చిన్నపిల్లలు వీటిని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇవన్నీ మూతబడిపోయాయి. ఇటీవల అన్ లాక్ చేస్తూ వస్తున్నా బయటి తిండి తినడానికి చాలా మంది భయపడిపోతున్నారు. పరిశుభ్రత, చేతులతో తాకడం నేపథ్యంలో అంతా నోటికి తాళం వేసుకొని పానీపూరి ఎప్పుడు తింటామా అని ఆలోచిస్తున్నారు. ఇక ఈ ఇబ్బందికి తెరపడే రోజు వచ్చేసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ మిషన్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

భౌతిక దూరం పాటిస్తూ.. పరిశుభ్రమైన పానీపూరీని మీ చేతులతో మీరు తీసుకునే యంత్రాలు తయారు అవుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ పానీపూరీ వెండింగ్‌ మెషీన్‌లో 20 రూపాయల నోటు పెట్టగానే. అది మెషీన్‌లోనుంచి కదులుతోన్న బెల్టుపై వెంటనే గోల్‌గప్పా ప్రత్యక్షం అవుతుంది. దాన్ని తీసుకొని కావాల్సిన వాటర్ వేసుకొని నోట్లో పెట్టుకోవడమే. దీని ద్వారా ఎలాంటి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండకపోగా.. శుభ్రతను కచ్చితంగా పాటించవచ్చని చెబుతున్నారు. ఈ యంత్రాన్ని అస్సాంకు చెందిన వ్యక్తి తయారు చేశాడు. సుమారు ఆరు నెలల పాటు కష్టపడి దీన్ని ఆవిష్కరించాడు. అతడు చేసిన పనికి పానీపూరీ ప్రియులు తెగ సంబరపడిపోతున్నారు. మొత్తానికి ఏటీఎం మిషన్‌ను తలపించే ఈ యంత్రం అందుబాటులోకి వస్తే పానీపూరీ కష్టాలు తీరిపోతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.