panna farmer found diamond of in field
mictv telugu

సుడిగాళ్లు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు

September 23, 2022

అదృష్టం ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో ఏమీ చెప్పలేం. అంతా బాగుంటే రాత్రికి రాత్రి పేదరికం మాయమయిపోతుంది. ఇందుకు ఉదాహరణ మధ్యప్రదేశ్ లోని ఒక రైతును చెప్పుకోవాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా బ్రిజపుర్ కు చెందిన రాజేంద్ర గుప్త ఒక వజ్రాల మైన్ ను లీజుకు తీసుకున్నారు. తన స్నేహితులతో కలసి వజ్రాల గనిని లీజుకు తీసుకుని వజ్రాల కోసం వెతుకుతున్నారు.

లల్కీ ధేరీ అనే ప్రాంతంలో ఒక చిన్న డైమండ్ మైన్‌ను లీజుకు తీసుకున్న రాజేంద్ర.. స్నేహితులతో కలసి వజ్రాల వేట కొనసాగించాడు. ఒక నెలపాటు నిరంతరాయంగా శ్రమించినా వజ్రం దొరకలేదు. తాజాగా గురువారం వారికి 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీన్ని డైమండ్ ఆఫీస్‌కు తీసుకెళ్లి అధికారులకు చూపించారు. దీని విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంత విలువైన వజ్రం దొరకడం వల్ల వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును.. సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని వారు వెల్లడించారు.