Panth and Pandya who were overwhelmed... ODI series belongs to India..
mictv telugu

అదరగొట్టిన పంత్, పాండ్యా..వన్డే సిరీస్ భారత్‌దే..

July 18, 2022

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గతకొన్ని రోజులుగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లు నిన్నటితో ముగిశాయి. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించిన భారత్.. రెండోవ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలయ్యింది. దాంతో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఆదివారం రోజున మాంచెస్టర్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత ఆటగాళ్లు రిషభ్ పంత్, హార్దిక్‌ పాండ్యాలు దుమ్ములేపారు. నిరాశకు గురైన క్రికెట్ అభిమానుల చేత ఈలలు వేయించారు. ఇంగ్లాండును తమ సొంత గడ్డపై ఓడించి, వన్డే సీరిస్‌ను సొంతం చేసుకున్నారు.

ముందుగా టాస్ గెలిచిన భారత్.. ఫిల్డింగ్ ఎంచుకొని, ప్రత్యర్థికి బ్యాటింగ్‌ను అప్పజెప్పింది. దీంతో మొదటగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండు..రాయ్‌ (41), బెయిర్‌స్టో (0), రూట్‌ (0), స్టోక్స్‌ (27), బట్లర్‌ (60), అలీ (34), లివింగ్‌స్టోన్‌ (27), విల్లే (18), ఓవర్టన్‌ (32), కార్స్‌ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ స్కోర్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్..రోహిత్‌ (17), ధావన్‌ (1), కోహ్లి(17), పంత్‌ (నాటౌట్‌) 125, సూర్యకుమార్‌ (16), పాండ్యా (71), జడేజా 7 పరుగులతో నాటౌట్‌‌గా నిలవడంతో భారత్.. 42.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగులు సాధించి, ఇంగ్లాండు గడ్డపై ఘన విజయం సాధించింది.

ఈ చివరి వన్డేలో పంత్ సూపర్ సెంచరీతో చెలరేగిపోగా, మరో 47 బంతులు మిగిలుండగానే భారత్ జయభేరి మోగించింది. అంతేకాదు, పంత్‌కు వన్డేల్లో ఇదే తొలి సెంచరీ. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులతో 125 పరుగులు చేశాడు. పంత్ సెంచరీ చేయడంతో భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసి, 2-1తో వన్డే సిరీస్‌ను చేజిక్కించుకుంది.

ఇక, పాండ్యా విషయానికొస్తే..మిడిలార్డర్‌ను కట్టడి చేసి, 55 బంతుల్లో 10 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. పాండ్యా అవుటైన తర్వాత రవీంద్ర జడేజా బరిలో దిగి, పరిస్థితికి తగ్గట్టుగా ఆడాడు. మ్యాచ్‌ చివర్లో పంత్ విజృంభించడంతో భారత్ సునాయాసంగా గెలుపు తీరాలకు చేరింది.