గవర్నర్ పైకి పేపర్ బాల్స్.. - MicTv.in - Telugu News
mictv telugu

గవర్నర్ పైకి పేపర్ బాల్స్..

May 15, 2017

ఉత్తరప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు గందరగోళంగా మొదలయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే.. గవర్నర్‌ రామ్‌నాయక్‌ సభనుద్దేశించి ప్రసంగించారు. ఇంతలో ఎస్పీ సహా ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.అంతటితో ఆగకుండా.. ప్రసంగిస్తున్న గవర్నర్‌పైకి కాగితపు బంతులు, పోస్టర్లు విసిరారు.

దీంతో మార్షల్స్‌ అప్రమత్తమై రామ్‌నాయక్‌కు భద్రత కల్పించారు. ఫైళ్లు, పుస్తకాలతో గవర్నర్‌కు అడ్డంగా నిలుచున్నారు. ఆ సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా సభలో ఉన్నారు. దీంతో ఆయన ప్రసంగాన్ని ఆపేసి.. ‘ఉత్తరప్రదేశ్‌ మొత్తం మిమ్మల్ని చూస్తోంది’ అని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలకు గవర్నర్‌ చెప్పారు.అయినా వినిపించుకోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉండటంతో సభలో గందరగోళం నెలకొంది. బీజేపీ అఖండ విజయం తర్వాత యూపీలో
తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం హైలైట్.

HACK:

  • Paper balls and posters thrown on governor by opposition patty members in Uttar Pradesh assembly meeting