పప్పులాంటి అబ్బాయి పాట విడుదల.. - MicTv.in - Telugu News
mictv telugu

పప్పులాంటి అబ్బాయి పాట విడుదల..

November 10, 2019

వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే వివాదస్పద సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే రామ్ గోపాల్ వర్మ కేఏ పాల్‌పై తీసిన ఓ పాటను విడుదల చేశారు.

ఆ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో నుంచి మరో పాటను విడుదల చేశాడు. ‘పప్పులాంటి అబ్బాయి’ అంటూ సాగే ఈ పాట పూర్తిగా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ను టార్గెట్ చేస్తూ రాసినట్లుగా ఉంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్టు వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు.