పారాసెటమాల్ ధర పెంపు.. ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

పారాసెటమాల్ ధర పెంపు.. ఎంతంటే?

March 26, 2022

06

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసరాల ధరలు, పెట్రోల్,డీజిల్ ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ ఔషధాల ధరలు కూడా ఏప్రిల్ నుంచి పెరగనున్నట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి. జ్వరానికి, ఇన్ఫెక్షన్‌కి, బీపీ వంటి వ్యాధులకు ప్రజలు ఉపయోగించే, అత్యవసర ఔషధాల ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నట్లు జాతీయ ఔషధాల ధరల సంస్థలు తెలిపాయి. ధరలను 10.8శాతానికి పెంచుతూ, ఓ ప్రకటనను విడుదల చేశాయి. 2021 సంవత్సరానికి గానూ, మందుల టోకు ధరల సూచీని ఎన్పీపీఏ తాజాగా వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, ఈ సూచీ 10, 7 శాతం పెరిగినట్లు తెలిపాయి. అంటే.. 800 షెడ్యూల్డ్ మందుల ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10.7 శాతం పెరగనున్నాయి.

మరోవైపు జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మ వ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ వచ్చే నెల నుంచి ప్రియం కానున్నాయి. ఇందులో పారాసెటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి ఔషధాలున్నాయి. విటమిన్స్, మినరల్స్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇందులో కొన్నింటిని కొవిడ్ బాధితులకు చికిత్సలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా తయారీ ఖర్చులు పెరగడంతో ఈ ఔషధాల ధరలను పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఔషధాల ధరల నియంత్రణ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.