కేసీ..ఆ..ఆ..ఆర్.. మీకు ఫికరైత లేదా? - MicTv.in - Telugu News
mictv telugu

కేసీ..ఆ..ఆ..ఆర్.. మీకు ఫికరైత లేదా?

September 4, 2017

రోజురోజుకూ కొండెక్కుతున్న స్కూలు ఫీజులపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల మొర వినే నాథుడే కరువయ్యాడు. అధికారులకు, మంత్రులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోతోంది. దీంతో బాధితులు ఈ సమస్యను ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొళ్లేందుకు వినూత్న యత్నం చేశారు.

కేసీఆర్ మాస్క్ ధరించిన ఓ వ్యక్తికి తమ గోడు వెళ్లబోసుకుంటూ ఓ వీడియో తీశారు. ‘కేసీఆర్.. మీకు మా సమస్యలు పట్టవా. ఏమేం చేయాలి.. చచ్చిపోవాలా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ వారు ఈ వీడియో తీశారు. ‘కేసీఆర్ ఫీజుల నియంత్రణంలో విఫలమయ్యారు.. స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను లూటీ చేస్తోంటే సీఎం చూస్తూ కూర్చున్నారు. ఢిల్లీలోని ప్రభుత్వం రీఫండ్ ఇస్తోంటే కేసీఆర్ మాత్రం స్కూళ్ల యాజమాన్యాలతో మిలాఖతై పేరెంట్స్ ను లూటీ చేస్తున్నారు.. కేసీఆర్ కు ధర్నాలు చేసి మద్దతిచ్చాం.. అధికారంలోకి తెచ్చాం.. కానీ ఆయన ఆ విషయాన్ని మరచిపోయారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను ఎప్పుడు అమలు చేస్తారు? స్కూళ్ల దోపిడీని ఎప్పుడు ఆపుతారు.. ’ అని ప్రశ్నల వర్షం కురించారు.

ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.