కేరళ బీచ్ వెకేషన్కు వెళ్లిన ఓ జంట అడ్వెంచర్ చేయడానికి వెళ్ళి ప్రమాదంలో చిక్కుకుని తృటిలో తప్పించుకుంది. తిరువనంతపురం గ్రామీణ ప్రాంతంలోని వర్కాలలోని పాపనాశం బీచ్‌లో పారాగ్లైడింగ్కు వెళ్లిన పారాచూట్ అనుకున్న చోట్ ల్యాండ్ కాకపోవడంతో భయాందోళనకు గురయ్యారు పారాగ్లైడర్లు. అధిక వోల్టేజ్ లైట్లు ఉన్న విద్యుత్ స్తంభానికి పారాచూట్ చిక్కుకుపోయింది. పోల్ నుంచి కిందకు దిగేందుకు ఈ జంట పడిన పాట్లు వర్ణనాతీతం. ఈ దురదృష్టకరమైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Watch: Paragliding Gone Wrong, Two People Stuck On An Electric Pole In Kerala https://t.co/gU149qYIFq pic.twitter.com/knWihdQC1y
— NDTV (@ndtv) March 7, 2023
ఇద్దరు పారాగ్లైడర్లు 50 అడుగుల ఎత్తులో స్తంభంలో ఇరుక్కుపోయారు. వీరిద్దరూ కింద పడకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దాదాపు రెండు గంటల పాటు స్తంభానికి వేలాడుతూనే ఉన్నారు. వీరిని రెస్క్యూ చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నా వారిదగ్గర స్తంభాన్ని ఎక్కేంత ఎత్తు గల నిచ్చెన లేకపోవడంతో రెస్క్యూ ప్లాన్ లో భాగంగా పోల్ కింద ముందు జాగ్రత్త చర్యగా, పరుపులు, వలలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు సిబ్బంది వీరిద్దరిని సురక్షితంగా కిందకు దించింది. ఈ ప్రమాదం నుంచి 28 ఏళ్ల మహిళ , పారాగ్లైడింగ్ శిక్షకుడు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. వారిద్దరూ వర్కాలలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారుని, క్షేమంగా ఉన్నారన్నారు.