నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ ముసలి తల్లి అతనికి భారమైంది. ఆమెను వదిలించుకోడానికి సజీవంగా పూడ్చిపెట్టేశాడు. మనిషితనానికే మచ్చతెచ్చిన ఈ దారుణం చైనాలో జరగింది. షాంగ్జీ రాష్ట్రానికి చెందిన వాంగ్ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి పక్షవాతం సోకింది. ఆమెకు సపర్యలు చేయడం ఇష్టంలేని కొడుకు యాంగ్(58) ఈ నెల 2న ఆమెను వీల్ చెయిర్లో బయటకి తీసుకెళ్లాడు. ఎవరో తీసి వదిలేసిన సమాధి గుంతలో ఆమెను సజీవంగా పూడ్చిపెట్టాడు. పక్షవాతం వల్ల ఆమె ఏమాత్రం ప్రతిఘటించలేకపోయింది.
తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికొచ్చాడు. అతనికి భార్యకు అనుమానం వచ్చింది. అత్తమ్మ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యాక్ను పట్టుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వగా అసలు విషయం చెప్పేశాడు. తల్లికి సేవ చేసే ఓపిక తనకు లేదని, అందుకే పూడ్చేశానని చెప్పాడు. పోలీసులు వెంటనే శ్మశానానికి చేరుకుని గుంతను తవ్వాడు. ముసలమ్మ కొనవూపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి, కొడుకుపై కేసు పెట్టారు.