జవాన్లకు ఇక ఖాదీ యూనిఫార్మ్‌లు - MicTv.in - Telugu News
mictv telugu

జవాన్లకు ఇక ఖాదీ యూనిఫార్మ్‌లు

December 8, 2019

khadi uniform.

చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పారా మిలటరీ జవాన్లకు ఖాదీ యూనిఫారం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకొంది. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌జీ, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ జవాన్లకు ఈ ఖాదీ యూనిఫార్మ్‌లను అందించనున్నారు.

70 శాతం ఖాదీ, 30 శాతం పాలిస్టర్‌తో తయారైన పాలీ-ఖాదీ ఏకరూప దుస్తులు అందజేయనుంది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సమర్పించిన నమూనాలను పరిశీలించిన ఉన్నతాధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. కుటీర పరిశ్రమల్లో తయారు చేసే పచ్చళ్లు, సబ్బులు, షాంపూలు, అప్పడాలు, తేనె, టీ, ఆవ నూనెలను కూడా ఈ బలగాలు ఉండే క్యాంటీన్లలో ఉపయోగిస్తారు. ఏడు పారా మిలటరీ బలగాల్లో కలిపి దాదాపు 10 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.