రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు! - MicTv.in - Telugu News
mictv telugu

రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు!

September 4, 2017

రామోజీ ఫిలిం సిటీ.. ! అంతర్జాతీయ స్థాయి సినిమా స్టూడియో, ఇతర వినోద వేదికలతో అందరినీ ఆకట్టుకుంటున్న అద్భుత ప్రదేశం. అయితే అక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. లైట్లు వాటంతట అవే వెలుగుతూ, ఆరిపోతున్నాయని, వింత శబ్దాలు వినిపిస్తున్నాయని కథనాలు వినిపిస్తున్నాయి. ఫిలిం సిటీలో కొందరు ఆచూకీ లేకుండా పోయారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఓ ప్రఖ్యాత ఆంగ్ల వెబ్ సైట్ దేశంలోని 25 భయానక ప్రాంతాల పేరుతో రూపొందించిన జాబితాలో రామోజీ ఫిలిం సిటీ కూడా చోటుచేసుకుంది. ఇలాంటి మిగతా ప్రదేశాల్లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల కోట, జామలీ కమాలీ మసీద్, అగ్రసేన్ బావోలీ, సిమ్లాలోని 33వ రైల్వే టన్నెల్, కోల్ కతాలోని సౌత్ పార్క్ స్ట్రీట్ సిమెటరీ, మాహింలో డిసౌజా చావల్ ప్యాలెస్, ముస్సోరీలోని సవాయ్ హోటల్, పుణేలోని శనివార్ ద్వార్ తదితర ప్రదేశాలున్నాయి.