Parashar's video goes viral in wedding baraat
mictv telugu

తాగుబోతు బారాత్ వీడియో వైరల్

November 11, 2022

ఢిల్లీకి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో నయా ట్రెండ్ సెట్ చేశాడు. బారాత్‌‌లో డ్యాన్స్ చేస్తూ ఆ రీల్‌‌ని ఇన్ స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేయడంతో 30 లక్షల వ్యూస్ వచ్చాయి. భిన్నంగా ఉండాలనే తపనతో మిగతావారిలా ప్రాణాలకు తెగించి స్టంట్లతో రిస్క్ చేయకుండా చాలా సాధారణంగా నెటిజన్ల మనసు దోచుకున్నాడు. ఆ యువకుడి పేరు అన్ష్ పరాశర్. పెళ్లి బరాత్‌‌లో తాను చేసిన డ్యాన్స్‌ వీడియోని షేర్ చేశాడు. అయితే బరాత్‌‌లో ఆయన పాటకు డ్యాన్స్ చేయలేదు. డీజే సౌండ్, బ్యాండ్ రిథమ్‌‌లకు తగ్గట్టు హావభావాలు పలికించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

మద్యం తాగే విధానాన్ని కళ్ళకు కట్టినట్టు యాక్ట్ చేసి డ్యాన్స్‌‌లో మిక్స్ చేయడంతో నెటిజన్లు కొత్త తరహా మూవ్ మెంట్లుగా ఫీలవుతున్నారు. సీసా నుంచి మద్యం గ్లాసులో పోయడం, వాటర్ మిక్స్ చేయడం, సిప్ చేయడం, స్టఫ్ తినడం వంటి వాటిని కేవలం చేతులు, కాళ్ళు ఊపుతూ ప్రదర్శించాడు. నోరు తెరవకుండా తన మనుసులో మాటను చెప్పేసిన పరాశర్‌‌ టాలెంట్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇప్పటివరకు 30 లక్షల వ్యూస్ రాగా, వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. జోరు చూస్తుంటే త్వరలోనే ఈ సంఖ్య 50 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.