మా బిడ్డను చంపుకుంటాం..!  - MicTv.in - Telugu News
mictv telugu

మా బిడ్డను చంపుకుంటాం..! 

August 31, 2017

పాపం కన్నబిడ్డ పడుతున్న అవస్థను చూడలేక, ఏమీ చేయలేక  మనసు చంపుకున్న కన్న తల్లిదండ్రుల ఆర్తనాదం ఇది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తెట్టు పంచాయతీ పులగూరవారిపల్లెకు చెందిన బొగ్గల చిన్నరెడ్డెప్ప, సునీత దంపతులకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒక కుమారుడు. వీరి పెద్దకుమార్తె శుర్తిహాసన్‌(6) న్యూరోఫైబ్రోమా(నరాల బలహీనత)తో బాధపడుతోంది.

రల బలహీనతతో కాళ్లు,చేతులు చచ్చుబడిపోయాయి. చెంగు చెంగుమని దుంకుతూ ఆడుకోవాల్సిన వయసులో బిడ్డ జీవచ్ఛవంలా పడి ఉండడం చూసి ఆ తల్లి దండ్రులు తట్టుకోలేక కోర్టును ఆశ్రయించారు.

‘మా చేతిలో చిల్లిగవ్వలేదు, బిడ్డను కాపాడుకోవడంకోసం ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ప్రయోజనంలేదు.. నొప్పులు భరించలేక  బిడ్డ ఏడుపును చూడలేకపోతున్నాం. అందుకే మాబిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి’ అని  మదనపల్లె ఏడీజే కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఆ అధికారం తమకు లేదని..

జిల్లా కోర్టు గానీ హైకోర్టులో గానీ సంప్రదించాలని సూచించడంతో ఆ దంపతులు బిడ్డతో నిరాశగా వెనుదిరిగారు. ఆంధ్రప్రదేశ్ ను మరో సింగపూర్ చేస్తామని, మరో జపాన్ చేస్తామని బీరాలు పలుకుతున్న పాలకులు ఇలాంటి వారిని ఆదుకుంటే బావుంటుంది కదా.