కొడుకుపై పేరెంట్స్ కేసు.. ‘పిల్లల్ని కను లేదా డబ్బు కట్టు’ - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకుపై పేరెంట్స్ కేసు.. ‘పిల్లల్ని కను లేదా డబ్బు కట్టు’

May 11, 2022

ఒక్కగానొక్క కొడుకుకి 2016లో పెళ్లిచేస్తే ఇంతవరకు పిల్లలను కనలేదని తల్లిదండ్రులు కొడుకు, కోడలి మీద కోర్టులో కేసు వేశారు. అయితే దీని వెనుక మరో కారణం ఉంది. వివరాలు.. ఉత్తరాఖండ్‌కు చెందిన తల్లిదండ్రులు తమ అబ్బాయి చదువు కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు. మంచి విద్య కోసం అమెరికా కూడా పంపించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఘనంగా పెళ్లి జరిపించారు.

ఆ తర్వాత వారు వేరు కాపురం పెట్టేశారు. ఈ లోగా పేరెంట్స్ లోన్ తీసుకొని ఇల్లు కట్టారు. దాని కిస్తీలు కట్టలేక, చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. కొడుకు కూడా పట్టించుకోకపోవడంతో ఆ తల్లిదండ్రులు కోర్టు మెట్లెక్కారు. అయితే పిల్లలను కని ఇవ్వమని అడగడంలో వేరే ఉద్దేశం లేదు. ఇలా చేస్తే మా పరిస్థితి నలుగురి దృష్టిలో పడుతుందని అలా చేశారు. దయచేసి తమ కొడుకు నుంచి ఐదు కోట్లు నష్టపరిహారం ఇప్పించమని వారు కోర్టును కోరుతున్నారు. కనీస అవసరాలకు కూడా డబ్బులు పంపకపోవడంతో ఇలా కోర్టుకు రావాల్సి వచ్చిందంటూ ఆ వృద్ధ దంపతులు వాపోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.