‘నిన్ను ప్రణయ్‌ని చంపినట్టు చంపేస్తా’   - MicTv.in - Telugu News
mictv telugu

‘నిన్ను ప్రణయ్‌ని చంపినట్టు చంపేస్తా’  

September 22, 2020

pranayy

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య దేశంలో సంచలనం సృష్టించింది. ఆనాటి పరువు హత్యను గుర్తు చేస్తూ ఓ ప్రేమ జంటపై అమ్మాయి తల్లిదండ్రులు అమానుషంగా వ్యవహరించారు. తీవ్రంగా చితకబాది ప్రణయ్‌ని నడిరోడ్డుపై చంపినట్టుగా చంపేస్తామని  హెచ్చరించి అమ్మాయిని బలవంతంగా వెంట తీసుకెళ్లారు. గుంటూరు నగరంలో ఈ సంఘటన జరిగింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యకు, తనకు రక్షణ కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. 

 దళితుడైన దిలీప్‌, వైశ్య కులానికి చెందిన  సౌమ్య కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఇరువురు రెండు నెలలక్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి దూరంగా మరో చోట కాపురం పెట్టారు. విషయం తెలిసి అప్పటి నుంచి పగతో రగిలిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు మంగళవారం వారి ఇంటికి వచ్చారు. యువకుడిని తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండాప్రణయ్ మాదిరిగా హత్య చేస్తామని బెదరించి సౌమ్యను తీసుకెళ్లారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.