అత్యాచార బాలికను దత్తత తీసుకుంటా.. ఎమ్మెల్యే ఔదార్యం - MicTv.in - Telugu News
mictv telugu

అత్యాచార బాలికను దత్తత తీసుకుంటా.. ఎమ్మెల్యే ఔదార్యం

January 20, 2020

hgvbb bnb

అత్యాచార బాధితురాలికి అండగా నిలిచేందుకు పరిగి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ముందుకు వచ్చారు. ఆ బాలికను తాను దత్తత తీసుకొని తన చదువుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని పేర్కొన్నాడు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని వెల్లడించారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడాలని అన్నారు. ఎన్నో చట్టాలు ఉన్నా.. ఇలాంటి ఘటనలు జరగడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. 

పరిగిలోని బీసీ కాలనీకి చెందిన 11 సంవత్సరాల బాలికపై అదే ప్రాంతానికి చెందిన సాయి (24) అర్ధరాత్రి సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను చెట్ల పొదాల్లోకి తీసుకెళ్లి బెదిరించి లైంగిక దాడి చేశాడు.బాలిక తీవ్ర రక్తస్రావంతో ఇంటికొచ్చి జరిగిన విషయం చెప్పింది. వెంటనే చుట్టుపక్కల వారితో కలిసి కుటుంబసభ్యులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. బాధితురాలికి సఖి కేంద్రంలో ఆశ్రయం కల్పించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.