పరిటాల ఇంట మళ్లీ పెళ్లిసందడి.. - MicTv.in - Telugu News
mictv telugu

పరిటాల ఇంట మళ్లీ పెళ్లిసందడి..

March 29, 2018

దివంగత టీడీపీ నాయకుడు పరిటాల రవి ఇంట మళ్లీ పెళ్లిబాజాలు మోగనున్నాయి. రవి, ఏపీ మంత్రి పరిటాల సునీతల కుమార్తె స్నేహలత నిశ్చితార్థం గురువాంర అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఘనంగా జరిగింది. పరిటాల రవి సోదరి శైలజ కుమారుడైన వడ్లమూడి శ్రీహర్షను స్నేహలత పెళ్లాడనుంది. ఆమె మెడిసిన్ పూర్తి చేయగా, వరుడు వ్యాపారం చేస్తున్నాడు.

నిశ్చితార్థానికి మంత్రి కాల్వ శ్రీనివాసులు సహా పలువురు ప్రముఖలు హాజరయ్యారు. పెళ్లి మే నెల 6న వెంకటాపురంలో జరుపుతామని సునీత తెలిపారు. పరిటా రవి కుమారుడు శ్రీరామ్ పెళ్లి గత ఏడాది అక్టోబర్ 1న జరిగింది.  ఏడాది గడవకముందే మళ్లీ వారింట్లో పెళ్లి బాజాలు మోగనుండడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.