వైసీపీ ఎమ్మెల్యే 15 కోట్లు లంచం అడిగాడు.. అందుకే - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యే 15 కోట్లు లంచం అడిగాడు.. అందుకే

March 23, 2022

gnbgnb

వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి 15 కోట్ల రూపాయల లంచం అడిగాడని మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత ఆరోపించారు. నియోజకవర్గం నుంచి జాకీ పరిశ్రమ తరలిపోవడానికి ఎమ్మెల్యేనే కారణమని విమర్శించారు. పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయని టీడీపీ హయాంలో కృషి చేసి జాకీ కంపెనీని ఇక్కడికి రప్పిస్తే.. యాజమాన్యాన్ని 15 కోట్లు లంచం డిమాండ్ చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే వైఖరి వల్లే పరిశ్రమ తరలిపోయిందనీ, దమ్ముంటే పరిశ్రమను వెనక్కి తీసుకురావాలని సవాల్ విసిరారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. రాప్తాడుకు ప్రకాశ్ రెడ్డి అనే రాక్షసుడు గ్రహణంలా పట్టాడనీ, ప్రజలను వేధింపులకు గురి చేస్తూ ఆస్తులను లాక్కుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, ఉపాధి కావాలంటే టీడీపీ గెలవాలని వ్యాఖ్యానించారు. కాగా, పరిశ్రమ తరలిపోవడానికి నిరసనగా పరిటాల సునీత ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ పై విధంగా స్పందించారు.