షాకింగ్.. విమానానికి గట్టిగా కిస్ ఇచ్చిన విమానం..  - MicTv.in - Telugu News
mictv telugu

షాకింగ్.. విమానానికి గట్టిగా కిస్ ఇచ్చిన విమానం.. 

May 4, 2020

Parked Qatar airways planes collide in storm 

బలంగా వీస్తున్న ఈదురు గాలులకు వాతావరణం ఎంత బీభత్సంగా మారుతుందో తెలిసిందే. చెట్లు, రేకుల షెడ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటి ప్రచండ గాలులకు రన్ వేపై ఆపి ఉంచిన విమానమే కొట్టుకుపోయిందంటే అక్కడ గాలి తీవ్రత ఎంతుందో అంచనా వేయవచ్చు. గాలి ఒక్కసారిగా బలంగా వీచడంతో అది వెళ్లి పక్క విమానాన్ని ఢీ కొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2020, ఏప్రిల్ 30న దోహాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దోహాలోని Hamad international airportలో రన్ వేపై విమానాలు నిలిచి ఉన్నాయి. ఆ సమయంలో గాలులు బలంగా వీయడంతో 787 నెంబర్ గల విమానం గాలుల ధాటికి పక్కకు వెళ్లిపోయింది. అక్కడే ఉన్న A350-900 విమానాన్ని ఢీ కొట్టింది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గాలి ధాటికి విమానం ముందుకు ఎలా వెళ్లిందో అర్థం కావడం లేదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గాలి శాంతించాలని మరికొందరు కోరుకుంటున్నారు. మరికొందరైతే విమానాన్ని వెళ్లి గట్టిగా కిస్ ఇచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. కాగా, దోహాలో గంటకు 113 కిలోమీటర్ల మేర వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.