రూ.5 కే ఆకలి తీర్చే పార్లేజీకి కష్టాలు..10 వేల మంది ఇంటికి - MicTv.in - Telugu News
mictv telugu

రూ.5 కే ఆకలి తీర్చే పార్లేజీకి కష్టాలు..10 వేల మంది ఇంటికి

August 21, 2019

Parle may cut up to 10,000 jobs.

రూ.5కే కడుపు నింపే పార్లేజీ బిస్కట్ కంపెనీకీ కష్టకాలం వచ్చింది. జీఎస్టీ భారం ఈ కంపెనీ కొంప ముంచుతోంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ బిస్కెట్లను ఇష్టపడిమరీ తింటుంటారు. మార్కెట్లో మంచి ప్రొడక్టుగా గుర్తింపు సంపాదించుకున్న ఈ కంపెనీ బిస్కెట్ల రేటును అమాంతం పెంచింది. దీంతో కొనేవారు కరువయ్యారు. కొనకపోతే కంపెనీకి అపార నష్టమే వాటిల్లుతుంది. బిస్కెట్ సేల్స్ తగ్గడం.. తయారీ వ్యయం ఎక్కువగా ఉండటంతో పార్లే కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ పరిస్థితుల్లో కంపెనీ ఉద్యోగులను కూడా భారంగా భావించింది. దీంతో 10వేల మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధమైంది.   

బిస్కెట్ల ధరలు పెంచినా తయారీ ఖర్చుల భారాన్ని తగ్గించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ధరలు పెంచాల్సి వచ్చిందని పార్లే ప్రొడక్ట్స్ కేటగిరీ హెడ్ మయాంక్ షా చెప్పారు. బిస్కెట్ల తయారీకి వాడే 100కిలోలు కంటే తక్కువకు విక్రయించే గ్లూకోజ్, మ్యారీ, మిల్క్ ప్రొడక్టులపై జీఎస్టీ 18శాతం విధించడం కూడా కారణమంటున్నారు విశ్లేషకులు. ముడిసరుకుల ధరలు పెంచడం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో బిస్కెట్ల ధరలు పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో ఆర్థిక వృద్ధి మందగించడం కూడా మరొక కారణం అని మయాంక్ షా అన్నారు.  ఎఫ్ఎంసీజీ బ్రాండ్లలో పార్లే, పతంజలి, హిందుస్థాన్ లివర్, బ్రిటానియాపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఫుడ్ కేటగిరీల్లో సాల్టీ స్నాక్స్, బిస్కెట్లు, స్పైసీ ఫుడ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉండటం కూడా ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో సేల్స్ తగ్గిపోవడానికి ఒక కారణమని ఎఫ్ఎంజీ రిపోర్టులో నెల్సన్ తెలిపింది. కాగా, పార్లేజీకి దేశవ్యాప్తంగా 10 సొంత ఉత్పత్తి కేంద్రాలతో పాటు, 125 థర్డ్‌ పార్టీ బిస్కెట్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.