Parliament bans pamphlets, placards and leaflets, day after releasing list of unparliamentary words
mictv telugu

పార్లమెంటులో వాటిపైనా నిషేధం.. ఇప్పటికే పదాలపై, ధర్నాలపై

July 16, 2022

Parliament bans pamphlets, placards and leaflets, day after releasing list of unparliamentary words

ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా నిలవాల్సిన భారత పార్లమెంటు క్రమాంగా నిషేధాల నిలయంగా మారిపోతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చట్టసభలు నిషేధాలపై నిషేధాలు అమల్లోకి తెస్తున్నాయి. అవినీతి, పిరికిపంద, జుమ్లా, సిగ్గులేదు, నియంత వంటి పదాలను నిషేధించిన పార్లమెంటు.. చివరికి పార్లెమెంటు ఆవరణలో ధర్నాలు, నిరసనలు చేయకూడదని ఆంక్షలు విధించడం తెలిసిందే.

తాజా మరో నిషేధం కూడా అమల్లోకి తీసుకొచ్చింది. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు కరపత్రాల, ప్లకార్డులను ప్రదర్శించకూడదని లోక్ సభ ఆదేశాలు జారీ చేసింది.పార్లెమెంటు సభలో విపక్షాలు కరపత్రాలు, ప్లకార్డులు తీసుకెళ్లి నిరసన తెలపడం దశాబ్దాల నుంచీ వస్తున్న సంప్రదాయమే. తాజా నిషేధంతో వీటిని సభ్యులెవరైనా పట్టుకెళ్తే వారినీ నిషేధిస్తారు. అంటే సభల నుంచి బహిష్కరించే అవకాశముంది. విపక్షాలకు విమర్శించేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే మోదీ ప్రభుత్వం ఈ ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.