పార్లమెంట్‌లో దిశ ఘటనపై చర్చ..ఉరి తీయాలన్న ఎంపీలు - MicTv.in - Telugu News
mictv telugu

పార్లమెంట్‌లో దిశ ఘటనపై చర్చ..ఉరి తీయాలన్న ఎంపీలు

December 2, 2019

పార్లమెంట్ ఉభయ సభల్లో దిశ అత్యాచార ఉదంతంపై చర్చ జరిగింది. నేతలంతా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలను మరింత కఠినతరం చేయాలని సూచించారు. చాలా చోట్ల ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా వెంటనే నిందితులకు శిక్షలు విధించాలని కోరారు. 

Parliament.

ఈ సందర్భంగా మహిళా ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఇన్నాళ్లు అవుతున్నా మహిళ ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడం దారుణమని అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్ భావోద్వేగానికి గురయ్యారు. డిసెంబర్ 31లోగా నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.కాగా ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మాట్లాడుతూ.. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు. నిర్భయకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని గుర్తు చేశారు. ఇలా ఆలస్యం జరగడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు.