పార్లమెంట్‌ సమావేశాల్లో కోతులపై చర్చ..! - MicTv.in - Telugu News
mictv telugu

పార్లమెంట్‌ సమావేశాల్లో కోతులపై చర్చ..!

November 22, 2019

కోతుల బెడద ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బందులు పెడుతూనే ఉంది. వానరాలు గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు అయోమయంలో పడిపోతున్నారు. ఎప్పుడు ఏం ఎత్తుకెళ్తాయో అని జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇదే విషయం ఏకంగా పార్లమెంట్‌లోనూ గురువారం చర్చకు వచ్చింది. బీజేపీ ఎంపీ హేమమాలిని ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. దీనిపై పలువురు ఎంపీలు కూడా స్పందించారు. 

Monkeys.

మతపరమైన ప్రదేశాలలో కోతుల బెడద ఎక్కువగా ఉంటోందని ఎంపీ హేమమాలిని పేర్కొన్నారు.  తన నియోజకవర్గంలో గుళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద భక్తులు కోతుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనిపై ఢిల్లీ ఎంపీ చిరాగా పాశ్వాన్ కూడా స్పందించారు. ల్యూటెన్స్‌ ప్రాంతంలోనూ కోతుల వల్ల ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. కోతుల భయం ఎక్కువగా ఉందని దీని వల్ల చిన్న పిల్లలను బయటకు పంపడానికి భయపడుతున్నారని చెప్పారు. టీఎంసీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ ఓసారి కోతి తన కళ్లజోడుని తీసుకెతే దానికి జ్యూస్ బాటిల్ ఇచ్చి కళ్లజోడును తిరిగి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. ఎంపీలందరూ ఇలా కోతుల బెడద గురించి తమ అనుభవాలను కూడా చెప్పడం ఆసక్తిగా మారింది.