నిన్న బ్రహ్మదేవుడని తిట్టించుకున్నాడు.. ఈ రోజు తేదీలు ప్రకటించారు - MicTv.in - Telugu News
mictv telugu

నిన్న బ్రహ్మదేవుడని తిట్టించుకున్నాడు.. ఈ రోజు తేదీలు ప్రకటించారు

November 22, 2017

ప్రజా సమస్యలపై చర్చించడానికి  పార్లమెంటు ఇంకా ఎందుకు సమావేశపరచడం లేదని లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మంగళవారం మండిపడ్డారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికే సమావేశాల ప్రస్తావన తీసుకురావడం లేదన్నారు. ‘పార్లమెంటు సమావేశాలు ఎప్పుడుంటాయో ప్రధాని మోదీకే తెలుసు.. ఆయన బ్రహ్మదేవుడు.. ఆయనకు తెలియని విషయమే లేదు’ అని ఎద్దేవా చేశాడు.ఈ ఘాటు విమర్శలు అధికార బీజేపీకి బాగా తాకినట్లే కనిపిస్తోంది. పార్లమెంటు షెడ్యూలు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సమావేశాలు డిసెంబర్ 15 నుంచి, జనవరి 5 వరకు జరపాలని పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమాచారం పంపి అనుమతి తీసుకోనుంది. సమావేశాల్లో ట్రిపుల్ తలాక్‌, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది.