పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఇవే..! - MicTv.in - Telugu News
mictv telugu

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఇవే..!

November 18, 2019

Parliament ...

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 13వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదింపజేసేందుకు కేంద్రం భావిస్తోంది. గత సమావేశాల్లో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు బిల్లును ఆమోదించిన కేంద్రం ఈసారి మొత్తం 25 బిల్లులు ప్రవేశపెట్టనుంది. సమావేశాల నేపథ్యంలో విపక్షాలు కూడా పలు అంశాలపై ప్రశ్నించేందుకు తమదైన వ్యూహంతో సిద్ధమౌతున్నాయి.

26 రోజుల్లో 20 రోజులు కొనసాగనున్నాయి. మరోవైపు ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా వచ్చే 70వ రాజ్యాంగ దినోత్సవం, రాజ్యసభ 250వ సమావేశ ఉత్సవాలనూ నిర్వహించనున్నారు. ఈసారి ముఖ్యంగా ఎన్ఆర్‌సీ బిల్లు, వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు సహా మరో 25 ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మందగమనంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ఎక్కువ అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని తెలిపారు.