స్లీపర్ బస్సులు అందుబాటులో ఉన్నా.. ఆధునిక కార్లు ఎక్కే స్థోమత ఉన్నా..ఎన్ని రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా సరే.. వృద్ధులు సుదీర్ఘ ప్రయాణం చేయాలంటే రైలు ఉత్తమమైన మార్గంగా ఫీలవుతుంటారు. 50 సంవత్సరాలు పైబడిన చాలా మంది సీనియర్లు ట్రైన్ జర్నీనే ఇష్టపడతారు. అందుకే రైల్వే శాఖ తాజాగా వీరి కోసం ఓ శుభవార్తను ప్రకటించింది. రైలు ప్రయాణం చేసే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికోసం స్పెషల్ క్యాటగిరీలో సబ్సిడీ అందిస్తోంది.
పురుషులకు ఛార్జీలలో 40 శాతం రాయితీ ఇస్తుండగా, 58 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం రాయితీ కల్పిస్తోంది. సీనియర్ సిటిజన్లకు రాయితీలు అందించడం కొత్తేమి కాదు. గతంలోనూ రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇచ్చేంది . కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ రాయితీలను నిలిపివేశారు అధికారులు. ఇప్పుడు కోవిడ్ నుండి పరిస్థితి సాధారణమైంది. అందుకే తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు మేరకు తిరిగి రైల్వే శాఖ రాయితీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మెయిల్, ఎక్స్ ప్రెస్, రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో అన్ని తరగుతల ఛార్జీలలో సీనియర్లకు రాయితులు ఇవ్వనున్నారు.