చిలకతల్లి మాటామంతీ.. వైరల్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

చిలకతల్లి మాటామంతీ.. వైరల్ వీడియో

March 28, 2018

సృష్టిలో తల్లీబిడ్డల అనుబంధం ఏ జాతిలోనైనా ఒకటే. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, బువ్వపెడుతూ, మురిపాలు పోతారు తల్లులు. చిన్నా, కన్నా, నా బంగారే అంటూ మనషులు రాగాలు తీసి సంబరపడతారు. మాటలు రాని జంతువుల మూతులు నాకుతూ ముచ్చటపడతాయి. శిక్షణ ఇస్తే కాసిని పలుకులు పలికే చిలకలు కూడా అంతే. అయితే ఈ చిలకతల్లి మరింత యాక్టివ్. మనుషుల మధ్య పెరడగడంతో వారిలాగే మాటలు నేర్చుకుని, తన పిల్లలతో ముచ్చట పెట్టుకుంది.


‘గుడ్ మార్నింగ్.. ఐ లవ్యూ బేబీస్, గాన్నా ఫీడ్ ద బేబీస్(మీకు తినిపిస్తా)’ అని పదేపదే మాట్లాడుతోంది. ముద్దుపెట్టుకుని హత్తుకుంటోంది. దీన్ని పెంచుకుంటున్న అమెరికన్ మహిళ హగ్ ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఈ చిలక మామూలుగా అయితే చిన్నిచిన్న పదాలే పలుకుతుందని, అయితే పిల్లలపై ముంచుకొచ్చిన ప్రేమతో గలగలా మాట్లాడ్డంతో ఆశ్చర్యపోయానని హగ్ తెలిపింది.