‘నేరెళ్ల’పై రాష్ట్రపతికి ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

‘నేరెళ్ల’పై రాష్ట్రపతికి ఫిర్యాదు

August 23, 2017

సరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై దాడి చేసిన వారిని కఠనంగా శిక్షించాలని కోరుతూ పలు పార్టీల, ప్రజాసంఘాల నేతలు బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలసి కోరారు. దేశంలో దళితులపై ఇంకా దాడులు జరుగుతుండటం ఘోరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని కలసిన వారిలో సీపీఐ నేతలు డి.రాజా, అజీజ్ బాషా, చాడా వెంకట రెడ్డి (సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి), తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ) నాయకులు కోదండరామ్, గోపాలశర్మ, అంబటి శ్రీను, తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) అధ్యక్షుడు గురజాల రవీందర్, తెలంగాణ టిడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సంపత్ (ఎం.ఎల్.ఏ) మరియు గూడూరు నారాయణ రెడ్డి తదితరులు ఉననారు.