Passenger captures terrifying moment two helicopters crash mid-air
mictv telugu

గాలిలో రెండు హెలీకాఫ్టర్స్ ఢీ కొన్నాయి..వీడియో వైరల్

March 7, 2023

Passenger captures terrifying moment two helicopters crash mid-air

2023 నూతన సంవత్సర వేడుకల సమయంలో ఆస్ట్రేలియాలో ఊహించని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గాలిలో ఎగురుతున్న రెండు హెలీకాఫ్టర్స్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.తాజాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటపడ్డాయి. ప్రమాదానికి గురవ్వడానికి ముందు మహిళా పర్యాటకురాలు చిత్రీకరించిన వీడియో వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సీ వరల్డ్ మెరైన్ థీమ్ పార్క్. ఆ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉంటుంది. ఇక 2023 కొత్త సంవత్సరం సందర్భంగా భారీగా పర్యాటకలు వచ్చి చేరారు. కొందరు హెలీకాఫ్టర్స్‌లో బీచ్ అందాలను చూస్తూ విహారిస్తున్నారు. ఇదే సమయంలో మరో హెలీకాఫ్టర్ కింద నుంచి ఎగురుతూ వచ్చింది. దీంతో రెండు హెలికాప్టర్లు గాలిలోనే ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాద దృశ్యాలు ఆ మహిళ తీసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

హెలికాప్టర్‌లో పర్యటిస్తూ అక్కడి ప్రకృతి అందాలను తమ సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తున్న ప్రయాణికులకు తమకు దగ్గరగా ఏదో శబ్దం వినిపించింది. కిటికీ వెలుపల ఏదో చూపిస్తూ పైలట్‌ను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారు పైలట్ యాష్ జెంకిన్సన్, బ్రిటన్‌కు చెందిన దంపతులు రాన్, డయాన్ హ్యూస్, సిడ్నీకి చెందిన వెనెస్సా టాడ్రోస్‌గా గుర్తించారు. రాన్, డయాన్ దంపతుల ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.