రైళ్లు లేటుగా రావడం మీద వచ్చిన జోకులు మరే ప్రయాణ సాధనం మీద రాలేదంటే అతిశయోక్తి కాదు. సమయానికి రాకుండా ప్రయాణీకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటాయి అవి. అయితే పెరుగుతున్న టెక్నాలజీ, వేగం వంటి వాటిని భారతీయ రైల్వే అందిపుచ్చుకుంటోంది. దీంతో చెప్పిన సమయానికే చాలా రైళ్లు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ రైలు చెప్పిన సమయానికంటే ఇరవై నిమిషాలు ముందే వచ్చి ప్రయాణీకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
దీంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రయాణీకులు ఆనందంతో ఫ్లాట్‌ఫారంపై డ్యాన్సులు వేశారు. బుధవారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని రాట్లాం స్టేషన్లో ఈ ఘటన జరిగింది. బాంద్రా – హరిద్వార్ రైలు రాత్రి 10.35 కి చేరుకొని రాట్లాం స్టేషనులో పది నిమిషాలు ఆగుతుంది. అయితే రైలు 20 నిమిషాలు ముందే చేరుకోవడంతో 30 నిమిషాల టైం దొరికినట్టైంది. దీంతో ప్రయాణీకులు ఆనందం పట్టలేక సాంప్రదాయ గర్భా డ్యాన్సు చేశారు. ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్లో షేర్ చేస్తూ హ్యపీ జర్నీ అని విష్ చేశారు.
मजामा!
Happy Journey 🚉 pic.twitter.com/ehsBQs65HW— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 26, 2022