రైల్లో పోర్న్ ఆడియో.. అరుపులతో అవాక్కైన ప్రయాణికులు… - MicTv.in - Telugu News
mictv telugu

రైల్లో పోర్న్ ఆడియో.. అరుపులతో అవాక్కైన ప్రయాణికులు…

May 16, 2019

రైలు డ్రైవర్ తన మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. ఆ వీడియో ప్లే కాగానే దానికి సంబంధించిన ఆడియో.. రైలులోని సౌండ్ సిస్టంకి కనెక్ట్ అయ్యింది. దాంతో రైల్లోని అన్ని బోగీల్లోనూ శృంగార సంభాషణలు, అరుపులూ ప్రయాణికులకు వినిపించాయి. అవి విన్న ప్రయాణికులంతా షాకయ్యారు. ఈ ఘటన సౌత్ లండన్ ట్రైన్‌లో జరిగింది.

ఆ అరుపులు విన్న రైలులోని ప్రయణికుల్లో కొందరు వారిలో వారే.. నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన చిన్న క్లిప్పును రికార్డు చేసిన ఓ ప్రయాణికుడు.. ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి ఏకంగా 17 లక్షల వ్యూస్, 14,500 రీట్వీట్స్, 56వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఆ ఆడియోలో మాటలు ఎవరివి? డ్రైవర్ వా.. మల్టీ టాస్కింగ్ జరుగుతొందా’ అని ప్రశ్నించడం కలకలం రేపుతోంది. ఏదైమైన వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడాల్సి రైలు డ్రైవర్.. ఇలాంటి పనులు చేయడం సరికాదని మరికొందరు అంటున్నారు. డ్రైవింగ్ చేస్తూ.. మొబైల్ ఆపరేట్ చేయడం తప్పని తెలిసినా.. ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.