విమానంలో ఉరుపులు.. గొడుగులు పట్టుకుని(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

విమానంలో ఉరుపులు.. గొడుగులు పట్టుకుని(వీడియో)

July 12, 2020

Flight

వానకు పూరి గుడిసెలు, ఇల్లు, భవనాలు, చివరికి బస్సులు కురవగా చూశాం కానీ, విమానంలో కురవగా చూశామా? లేదు కదూ. ఆ రికార్డును మొట్ట మొదటిసారి సొంతం చేసుకుంది  రోసియా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం. ఖబరోవ్స్క్ నుంచి సోచికి సదరు విమానం బయల్దేరింది. నల్ల సముద్రానికి వెళ్లి హాలీడేస్ ట్రిప్‌కు వెళ్తున్న ప్రయాణికులు ఆ విమానం ఎక్కారు. ఖబరోవ్స్క్ నుంచి సోచికి బయలుదేరుతూ.. అలా గాల్లోకి ఎగిరింది విమానం. ఇంతలో భారీ వర్షం అందుకుంది.

ఆ వర్షానికి విమానంలో ఉరుపులు మొదలయ్యాయి. ఆ ఉరుపులతో విమానంలో అక్కడక్కడా కురవడం మొదలైంది. ఒక్కసారిగా విమానం క్యాబిన్‌లోకి నీరు చేరిపోయింది. దీంతో సిబ్బంది  గొడుగులను తీసింది. మరికొందరు ఆ నీటిలో తడుస్తూ ఎంజాయ్ కూడా చేశారు. కొందరు తడవకుండా గొడుగులు పట్టుకున్నారు. దాన్నంతా అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌ అయింది. అయితే, దీనిపై దర్యాప్తు జరిపిన అధికారులకు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ‘వర్షం కారణంగా క్యాబిన్‌లో నీరు లీకేజీ కాలేదు. ఏసీ వ్యవస్థ దెబ్బతినడంతోనే ఇలా జరిగింది’ అని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా అలరిస్తోంది.