ఏపీలో 150 మందితో మత ప్రార్థనలు..పాస్టర్ అరెస్ట్! - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో 150 మందితో మత ప్రార్థనలు..పాస్టర్ అరెస్ట్!

April 5, 2020

Pastar arrest in andhra pradesh

ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనల ఫలితంగా దేశంలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయిన సంగతి తెల్సిందే. అయినా కూడా మత పెద్దలు ఈ సంఘటన నుంచి గుణపాఠం నేర్చుకోలేదని తెలుస్తోంది. ఇటీవల మత ప్రార్థనలు నిర్వహించిన 23 మందిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. 

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా మత ప్రార్థనలు నిర్వహించిన ఓ పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని ఓ చర్చిలో ఆదివారం ఉదయం 3 గంటలకు జరిగింది. స్థానికంగా ఉన్న ఓ చర్చి పాస్టర్ 150 మణ్డితో ప్రార్థనలు నిర్వహించాడు. దీంతో స్థానికులు జిల్లా కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌కు సమాచారమిచ్చారు. తమ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రార్థనలు నిర్వహించారని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 150 మందిని ఇళ్లకు పంపించి వేశారు. తరువాత ప్రార్థనలను నిర్వహించిన చర్చి పాస్టర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.