తిరుపతిలో దారుణం.. యువతిపై పాస్టర్ అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

తిరుపతిలో దారుణం.. యువతిపై పాస్టర్ అత్యాచారం

October 15, 2020

bgcngn

తిరుపతిలో 20 ఏళ్ల యువతిపై ఓ పాస్టర్ లైంగిక దాడి చేశాడు. ఇంట్లో పని చేసే అమ్మాయిని బలవంతంగా లోబరుచుకున్నాడు. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయకపోవడంతో ఆలస్యమైంది. దీంతో వారు స్పందన కార్యక్రమం ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమె తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. 

చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన బాధితురాలు తిరుపతిలో ఉండే పాస్టర్ దేవసహాయంకు చెందిన రెయిన్‌బో క్లినిక్ ప్రోడక్ట్ కంపెనీలో పనికి చేరింది. ఈ క్రమంలో ఆమెపై కన్నేసిన అతడు ఈ నెల 3వ తేదీన సరకు డెలివరీ ఇవ్వాలని కారులో ఎక్కించుకొని వెళ్లాడు. తుకివాకం గ్రామ సమీపంలో  అత్యాచారం చేసి ఆ తర్వాత ఇంటికి తీసుకువచ్చి దింపేసి వెళ్లిపోయాడు. బాధితురాలు అస్వస్థతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎవరూ పట్టించుకోలేదు. ఈ  నేరాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా ఎస్పీ సుప్రజ విచారణకు ఆదేశించారు. పాస్టర్ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.