కొందరు పోలికలు వెతకడానికే ఉన్నారు...అనుష్క శర్మ ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

కొందరు పోలికలు వెతకడానికే ఉన్నారు…అనుష్క శర్మ ఆగ్రహం

June 3, 2020

anushaka.

బాలీవుడ్ నటి, ప్రొడ్యూసర్ అనుష్క శర్మకు కోపం వచ్చింది. ఇటీవల ఆమె నిర్మించిన‌ ‘పాతాళ్‌లోక్‌’ అనే వెబ్‌ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి మార్కులు తెచ్చుకున్న సంగతి తెల్సిందే. అయితే కొందరు ఈ వెబ్‌ సిరీస్ కంటెంట్‌పై పనికట్టుకుని విమర్శలు చేస్తున్నారు. ఇది సైఫ్‌ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ‘సేక్రేడ్‌ గేమ్స్‌’ వెబ్‌ సిరీస్ లా పోలుస్తున్నారు. 

దీనిపై ‘పాతాళ్‌లోక్‌’ నిర్మాత హోదాలో అనుష్క శర్మ ఘాటుగా స్పందించారు. ‘కొందరు జనాలు ఎప్పుడూ రెండింటి మధ్య పోలికలు వెతకడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఈ రెండు సిరీస్‌లు వేరు. దేని ప్రత్యేకత దానిదే. ఓటీటీ వేదికకు మంచి కంటెంట్‌ ఇచ్చేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. వారందర్నీ అభినందనలు తెలియజేస్తున్నా. పోలికలు ఆపి పాతాళ్‌లోక్‌ ను ఎంజాయ్ చేయండి’ అని ఆమె అన్నారు. ఇక పాతాళ్‌లోక్‌ విషయానికి వస్తే.. దీనికి అవినాష్‌ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్‌లో అభిషేక్ బెనర్జీ, నీరజ్ కబీ, జైదీప్ అహ్లవత్ ముఖ్యపాత్రల్లో నటించారు. మే 15న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ సిరీస్‌ ప్రేక్షకుల నుంచి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సిరీస్ ను అనుష్క, ఆమె సోదరుడు కర్ణేష్‌ శర్మ సంయుక్తంగా నిర్మించారు.