ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కారోనాకు చెక్ పెడుతుందని ఆయన ప్రచారం చేస్తున్న కరోనా ఔషధాలు విపరీతంగా అమ్ముడుతుపోతున్నాయి. విడుదలై నాలుగు నెలలు కూడా కాకముందే రూ. 250 కోట్ల టర్నోవర్ సాధించాయి. బాబా తన పతంజలి బ్రాండ్‌పై జూన్‌లో విడుదల చేసిన కరోనిల్ కిట్ వివాదాస్పదం కావడం తెలిసిందే. అది కరోనాను నయం చేస్తుందని తొలుత చెప్పిన బాబా తర్వాత మాట మార్చారు. కరోనా లక్షణాలను మాత్రమే తగ్గిస్తుందని అన్నారు. శ్వాసకోశ వ్యాధులకు మందు అని చెప్పి కరోనా మందుగా ప్రచారం చేసుకున్నారని ఉత్తరాఖండ్ అధికారులు ఆక్షేపించడంతో ఈయన వివరణ ఇచ్చారు.
ఏదేమైనా రాందేవ్ కరోనాకిట్కు మార్కెట్లోమాంచి డిమాండ్ ఉంది. ఈ కిట్‌లో ‘దివ్య స్వసరి వతి’, ‘దివ్య కొరోనిల్’ అనే మాత్రలు, ‘దివ్య అను తైల్’ అనే తైలం ఉంటాయి. ఈ కిట్ మనదేశంతోపాటు హిందువులు నివసించే విదేశాల్లోనూ బాగా అమ్ముడుబోతోంది. 25 లక్షల కిట్లను అమ్మినట్లే అంచనా. ఒక్కో కిట్ ధర రూ. 545.