పితృత్వ సెలవు అడిగితే.. బిడ్డ నీకే పుట్టాడా అన్నారు..  - MicTv.in - Telugu News
mictv telugu

పితృత్వ సెలవు అడిగితే.. బిడ్డ నీకే పుట్టాడా అన్నారు.. 

October 9, 2019

మహిళలకు ప్రసూతి సెలవులు ఉన్నట్లే కొన్ని దేశాల్లో పురుషులకు పెటర్నిటీ సెలవులు ఇస్తుంటారు. పనిరాక్షసులుగా పేరొందిన జపాన్ దేశంలోనూ ఇవి అమల్లో ఉన్నాయి. అయితే ప్రముఖ కంపెనీ ఈ విషయంలో అతి చేసింది. పితృత్వ సెలవు కావాలని అడిగిన ఉద్యోగిని కించపరచింది. పుట్టిన బిడ్డకు తండ్రివి నువ్వే అనే రుజువేంటన్నిప్రశ్నించింది. దీంతో అతడు డీఎన్ఏ పరీక్ష చేసి మరీ రిపోర్టును కంపెనీ ముఖాన కొట్టాడు. 

japan.

కెనడాకు చెందిన గ్లెన్ వుడ్ కొన్నేళ్లుగా జపాన్‌లోని మిట్సుబుషి యూఎఫ్జీ మోర్గాన్ స్టాన్లీ సెక్యూరిటీస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2015లో అతనికి కొడుకు పుట్టాడు. భార్య నేపాల్లో పనిచేస్తోంది. బిడ్డ పుట్టాడు కనుక పితృత్వ సెలవులు కావాలని గ్లెన్ అడగ్గా.. బిడ్డకు నువ్వేనా తండ్రివి అని అధికారులు ప్రశ్నించారు. దీంతో అతడు డీన్ఏ పరీక్ష చేయించి రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత కూడా కంపెనీ తనను మానసికంగా వేధించిందని గ్లెన్ ఆరోపించాడు. ఒత్తిడికి తట్టుకోలేక తాను మెడికల్ లీవ్ తీసుకున్నానని, తిరిగి ఆఫీసుకు వెళ్లగా ఉద్యోగం నుంచి తీసేసినట్లు చెప్పారని వాపోయాడు. జపాన్‌లో పెటర్నటీ సెలవులు సరిగ్గా ఇవ్వడం లేదనే ఆరోపణలు చాన్నాళ్లుగా ఉన్నాయి. ఆ సెలవులపై వెళ్లిన వాళ్లకు కంపెనీలు పదోన్నతులు ఇవ్వకుండా, హోదాలు తగ్గింస్తూ వేధిస్తున్నాయి.