బాద్‌షా దెబ్బకు బాక్సాఫీస్‌‌ షేక్.. రికార్డ్స్ తిరగరాస్తోన్న పఠాన్ కలెక్షన్స్ - Telugu News - Mic tv
mictv telugu

బాద్‌షా దెబ్బకు బాక్సాఫీస్‌‌ షేక్.. రికార్డ్స్ తిరగరాస్తోన్న పఠాన్ కలెక్షన్స్

February 2, 2023

 

pathan

 

బాక్సాఫీస్‌ దగ్గర పఠాన్‌ సినిమాకు కలెక్షన్ల పంట పండుతోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీకే భారీ హిట్ గా నిలిచింది. పఠాన్‌ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పుటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 634 కోట్ల కలెక్షన్లను అందుకున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. త్వరలో రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరబోతోంది. ఇండియా నుంచే 395 కోట్లు రాగా ఓవర్సీస్ నుంచి 239 కోట్లు వసూళ్లు అందుకుని బాలీవుడ్ హిస్టరీ లో అనేక రికార్డులు నమోదు చేసుకుంది.

చాలా తక్కువ సమయం లోనే భారీగా కలెక్షన్స్ నమోదు చేసిన పఠాన్ సినిమా బాలీవుడ్ కి పూర్వ వైభవంను తీసుకొచ్చినట్టే అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. కేవలం వివాదాల కారణంగా పఠాన్ సినిమా భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. సినిమాలో దీపికా పడుకొనే ధరించిన కాషాయం బికినీ కారణంగా వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. పఠాన్‌ సినిమా ను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కానీ అదే సినిమాకు అనూహ్యంగా భారీ కలెక్షన్స్ ని తెచ్చిపెట్టింది.

ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్‌గా, యాక్షన్ సినిమాగా పఠాన్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. హీరోహీరోయిన్ల రెమ్యూనేషన్, ఇతర ఖర్చులతోసహా ఈ సినిమాను 260 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు.భారీ అంచనాల నడుమ జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్స్’లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అందులో ఇండియాలో 5500 ఉండగా.. ఓవర్సీస్ 2500. ఇక ఈ సినిమా ఇటు హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. అంచనాలకు మించి ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో కింగ్‌ ఖాన్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.