బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా తెరకెక్కిన పఠాన్ చిత్రం జనవరి 25న విడుదల అవనుంది. అయితే ఈ చిత్రం నుంచి బేషరమ్ రంగ్ అనే పాటను రిలీజ్ చేయగా, అది ఎంత వివాదాస్పదమయ్యిందో తెలిసిందే. బికినీలో కాషాయ రంగుపై పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ సన్నివేశాలను తొలగించకపోతే సినిమాను నిషేధిస్తామని మధ్యప్రదేశ్ హోం మంత్రి ప్రకటించారు కూడా. వీరే కాక, మధ్యప్రదేశ్ ఉలేమాల సంఘం కూడా చిత్రంపై ఆరోపణలు చేసింది. పఠాన్ లను అసభ్యంగా చూపించారని, తద్వారా మనోభావాలను గాయపరిచారని వ్యాఖ్యానించింది.
कोई कैसे इस स्तर तक गिर जाता है @Uppolice कृपया संज्ञान लीजिए!! pic.twitter.com/Oudp9cJMQd
— Saurabh Marodia (@SaurabhSMUP) December 18, 2022
ఇదిలా ఉంటే ఈ పాటలో దీపిక బికినీలో ఉండగా, షారూక్ వెనుకనుంచి హత్తుకునే సన్నివేశం ఒకటుంది. దాన్ని ఓ వ్యక్తి దీపికకి బదులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఫోటోను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అజార్ ఆర్కే అనే ఖాతాలో ఈ మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని చూస్తే సీఎం యోగీని షారూఖ్ పట్టుకున్నట్టు కనిపించడంతో ఇది అవమానకరమని మండిపడుతున్నారు. యూపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లక్నోలో ఈ పోస్ట్ పై సైబర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 295ఏ, ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. ఈ పని చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు సోమవారం తెలిపారు. అంతేకాక, ఈ కేసును డీజీపీ హెడ్ క్వార్టర్స్ సైబర్ టీం విచారణ చేపట్టిందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :